ప్రముఖ సినీ దర్శకుడు గుల్జార్‌కు ఇందిరాగాంధీ అవార్డు
న్యూఢిల్లీ: ప్రముఖ కవి, సనీ దర్శకుడు గుల్జార్ 27వ ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారానికి ఎంపికయ్యరు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. ప్రజల్లో జాతీయ సమైక్యతా స్ఫూర్తిని పెంపొందించడం, పరిరక్షించడంలో చేసిన కృషికిగాను 75 ఏళ్ల గుల్జార్‌కు ఈ పురస్కారాన్ని ఇవ్వనున్నారు. పురస్కారం కింద జ్ఞాపికతో పాటు రూ.5 లక్షలు అందజేస్తారు.



