ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్‌:భన్వర్‌లాల్‌

ఈ రోజు ఉదయం 11.30 ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ మాట్లాడుతూ మొత్తం 5413 పోలింగ్‌ కేంద్రాల్లో కేవలం 16 కేంద్రంలో మాత్రమే ఈవీయంలు మార్చినట్లు ఆయన తెలిపాడు. ఎమ్మిగనూరు నియోజకర్గంలో 5శాతం మాత్రమే నమోదయినట్లు ఆయన తెలిపాడు. నరసన్నపేట నియోజకవర్గంలో మొదటి గంటలో అత్యధికంగా 13 శాతం పోలింగ్‌ నమోదయిందని, నెల్లురు పార్లమెంట్‌ పరిదిలో రెండు గ్రామాల్లో పోలింగ్‌ బహిష్కరించినట్లు ఆయన తెలిపాడు.