ప్రాణాంతక హరిత బయోప్రోడక్ట్స్‌ను ఎత్తివేయాలి

కరీంనగర్‌: జులై 2 (జనంసాక్షి)
పర్లపల్లి లోని హరిత బయోప్రోడక్ట్స్‌ కంపనీని ఎత్తివేయాలని ప్రాణాలతో చలగాట మాడటం తగదని లోక్‌సత్తా జిల్లా ఉద్యమసంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.శ్రీనివాస్‌, టి.రాజమౌళి డిమాండ్‌ చేశారు. గత వారం రోజులుగా నడుస్తున్న ఇథనైల్‌ కంపనీ వల్ల ఎదుర్కోంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావని అందుకే వారు సంఘటితంగా ఉద్యమించారని వారిపైన పెట్టిన కేసులను ఉపసంహరించు కోవాలని జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. అన్ని రకాల అనుమతులున్నాయని కంపనీ యాజమాన్యం చెప్పడం సరికాదని కంపనీ వ్యర్థాలు బయటికి వదిలే హక్కులేదని దేశంలో డబ్బు, అధికారం, రాజకీయ పలుకుబడి కలిగినవారే చట్టాలను ఉల్లంగిస్తున్నారని కాలుష్య నియంత్రణ మండలి మాత్రం వాళ్ళ వసుళ్ళు వారు చేసుకుని చూసి చూడనట్లుగా ఉంటున్నారని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలీకి కంపనీ మూసివేయాలని ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిథులు ప్రజల పక్షాన నిలువాలని వీరు డిమాండ్‌ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యులు రాజయ్య, శంకర్‌, లక్ష్మీ, గంగారావు, చుక్కరెడ్డి, కోల రామచంద్రరెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.