ప్రారంభమైన తెలంగాణ లాయర్ల ర్యాలీ

హైదరాబాద్‌: హైకోర్టు నుంచి తెలంగాణ లాయర్లు ర్యాలీగా బయలు దేరారు. ఉద్యమ కాలంలో హైకోర్టు వద్ద తెలంగాణ లాయర్లు ధర్నా చేపట్టిన కేసులో వారిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతించడాన్ని న్యాయవాదులు నిరసిస్తున్నారు. ఈమేరకు వారి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతిస్తూ జారీ చేసిన జీవో నెంబరు 2348ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఇవాళ వారు హైకోర్టు నుంచి ర్యాలీకి పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో న్యాయవాదులు ఈ ర్యాలీకి తరలివచ్చారు. హైకోర్టు నుంచి మదినా వరకు ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం. టీజీవోల నేత శ్రీనివాస్‌ గౌడ్‌ హాజరయ్యారు.