ప్రార్థనల సమయంలో కోతలను నిరసిస్తూ ముస్లింల ఆందోళన

విజయవాడ: రంజాన్‌ ప్రత్యేక ప్రార్థనల సమయంలో విద్యుత్‌ కోతలకు నిరసనగా స్థానిక పాయకపురం సబ్‌స్టేషన్‌ వద్ద ముస్లింలు ఆగ్రహంతో నిరసన వ్యక్తం చేశారు. తెదేపా, సీపీఎం, వైకాపా నేతలు వీరికి మద్దతు ప్రకటించి ధర్నాలో పాల్గొన్నారు. అధికారులు వచ్చి హామి ఇచ్చేవరకూ ఇందోళన విరమించమని ముస్లింలు హెచ్చరించారు.