ప్రేమపెళ్లి చేసుకున్న నవదంపతుల ఆత్మహత్య!
హైదరాబాద్: ఆ ప్రేమ జంటకు పెళ్లైన నాలుగు నెలలకే నూరేళ్లు నిండాయి. వారికి ఏం కష్టమొచ్చిందో ఏమో ఇద్దరూ కలసి ఆత్మహత్య చేసుకున్నారు. దుండిగల్లో ఈ విషాద సంఘటన జరిగింది.
దుండిగల్కు చెందిన వెంకటేష్, ప్రీతి ప్రేమించుకున్నారు. నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ రోజు ఇద్దరూ కలసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దుర్ఘటనకు కారణాలు తెలియవలసి ఉంది.