ప్రేమించి మోసం చేశాడంటూ యువతి పీఎస్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం

నల్గొండ: పోలీస్‌స్టేషన్‌ ఎదుట పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లిలో చోటు చేసుకుంది. నాగార్జున అనే యువకుడు తనని ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి వాడపల్లి పీఎస్‌ ఎదుట ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు.