ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ ల్లో 11 మంది సభ్యులు ‘మా’కు రాజీనామా

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఎంత ర‌చ్చ‌గా మారాయో మ‌నం చూశాం. ఎన్నిక‌లు ముగిసాయి, అంతా చ‌ల్ల‌బ‌డింది అనుకున్న స‌మ‌యంలో ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ పెద్ద బాంబ్ పేల్చారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు ‘మా’కు రాజీనామా చేశారు. ఆయనకు మద్దతుగా కొందరు సినీ పెద్దలు కూడా ఉన్నారు. విష్ణుకి ఇబ్బందులు ఉండకూడదనే తమ మెంబర్స్ రాజీనామా చేసినట్లు ప్రకాశ్ రాజ్ తెలిపారు.

ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ స‌భ్యులు కొద్ది సేప‌టి క్రితం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయ‌గా, న‌టుడు బెన‌ర్జీ చాలా ఎమోష‌న‌ల్‌గా మాట్లాడారు. క‌న్నీరు పెట్టుకున్నారు. నన్ను మోహన్ బాబు అరగంట తిడుతూనే ఉన్నారు. ఎందుకు అలా చేశారో అర్ధం కాలేదు. దారుణంగా మాట్లాడారు. నేను ఎప్పుడూ ఇటువంటి మాటలు పడలేదు. మోహ‌న్ బాబు తిట్టిన మాట‌ల‌కు ఆయ‌న భార్య కూడా బాధ‌ప‌డ్డారు.

”మంచు లక్ష్మిని ఎత్తుకుని తిరిగాను. కానీ, మోహన్ బాబు నన్ను బండ బూతులు తిట్టారు. కొట్టడానికి వచ్చారు. మోహన్ బాబు ఎందుకు తిట్టరనేది నాకు అర్ధం కావడం లేదు.” అంటూ బెనర్జీ ఎమోషన్ అయ్యారు. తనీష్ కూడా త‌న బాధ‌ను వ్య‌క్తం చేశారు.బౌన్స‌ర్స్‌తో కొట్టించ‌బోయారు అని చెప్పాడు. ఉత్తేజ్‌, శ్రీకాంత్, ప్ర‌భాక‌ర్ కూడా అక్క‌డి ప‌రిస్థితుల గురించి చెబుతూ ఎమోష‌న‌ల్ అయ్యారు.