ఫాప్సీ ఎక్సలెన్సీ అవార్డుల నామినేషన్లకు ఆహ్వానం
హైదరాబాద్ : రాష్ట్ర వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య ఏటా ఇచ్చే ఎక్సలెన్సీ అవార్డుల కార్యక్రమం నిర్వహణకు తెరలేచింది.సూక్ష్మ, మధ్య, భారీ తరహా పరిశ్రమలకు సంబంధించి అన్ని విభాగాల్లోనూ ఈ అవార్డులకు నామినేషన్లు కోరుతున్నట్లు ఫ్యాప్సీ ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావు తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం 21 విభాగాల్లో అవార్డులను అందిస్తున్నామన్నారు. పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు అవార్డులు అందిస్తామని, ఈ ఏడాది కొత్తగా వ్యవసాయ రంగం, పర్యాటకంతో పాటు పారిశ్రామిక సమాఖ్యల విభాగాల్లోనూ అవార్డులు ఇస్తామని వెల్లడించారు. ఫ్యాప్సీ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకుని ఏప్రిల్ 10 లోపు అందించాలని సూచించారు.