ఫిజియో థెరఫి వైద్య శిబిరం

వినుకొండ, జూలై 18: మండల కేంద్రమైన నూజెళ్ల ఐఇడి కేంద్రంలో ఫిజియో థెరఫి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగ విద్యార్థులకు ఫిజియో థెరఫి డాక్టర్‌ నాగరాజు పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ క్రమం తప్పకుండా వికలాంగ విద్యార్థులు డాక్టర్‌ సలహాలు పాటిస్తే ఫలితాలు మెరుగుగా ఉంటాయని అన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రభుత్వం ప్రతివారం ఫిజియో థెరఫి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఇడి ఉపాధ్యాయురాలు పద్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.