ఫిబ్రవరి 20, 21న దేశవ్యాప్త సమ్మె

ఖమ్మం, నవంబర్‌ 6 : కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను రద్దు చేసి, కనీస వేతనం 10వేల రూపాయల వరకు అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక భద్రత, కాలం చెల్లిన చట్టాల మార్పు, కేంద్ర పరిశ్రమల్లో పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకంగా దేశంలోని 12 కేంద్ర కార్మిక సంఘాలు ఐక్యంగా ఫిబ్రవరి 20, 21 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు నిర్ణయించినట్లు ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు జలీల్‌ తెలిపారు. జిల్లాలో రెండు రోజుల సమ్మెను ఇప్పటినుంచే కార్మికులను సన్నద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కలెక్టర్‌ చొరవ చూపడం లేదని అన్నారు. వీరితో పాటు నీలం తుపాన్‌ బాధిత రైతులకు పంట నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.