ఫిలిఫ్పీన్స్‌లో పెను తుపాను : 475కు చేరిన మృతుల సంఖ్య

మనీలా: బోఫా పెను తుపాను ఫిలిఫ్పీన్స్‌ను అతలాకుతలం చేస్తోంది. తుపాను ధాటికి ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 475కు చేరింది. వివిధ ప్రాంతాల్లో మూడు వందల మందికిపైగా గల్లంతయ్యారు. ఒక్క కంపోస్టెల కొండ ప్రాంతంలోనే 184 మంతి మృత్యువాత పడ్డట్లు అధికారులు వెల్లడించారు. తుపానుతో రవాణా వ్యవస్థ స్తంభించింది. పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయి గల్లంతైనవారి కోసం సైన్యం, అధికార సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది.

తాజావార్తలు