ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఏబీవీపీ ధర్నా-అరెస్ట్‌

హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ తేదిలను తక్షణమే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఉస్మానియా యూనివర్శిటీ ఏబీవీపీ ఆందోళన చేపటంది. ఆర్ట్స్‌ కళాశాల నుంచి ర్యాలీగా తార్నాక వైపు వెళ్తుండగా ఓయు పోలీసు స్టేషన్‌ వద్ద పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. ఈ సంధర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయటంతోపాటు తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 13న రాష్ట్ర బంద్‌కు పిలుపిస్తామని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు కడియం రాజు అన్నారు.