ఫ్రాన్స్‌లో మన నల్లధనం రూ. 565కోట్లు

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌లో భారతీయుల అక్రమంగా రూ.565కోట్ల మేరకు నల్లధనం దాచుకున్నట్లు తెలిపింది. ద్వంద్వపన్నుల విధానం నుంచి తప్పుకునే ఆంశం ప్రాతిపదికగా సమాచార మార్పిడి కింద ఫ్రాన్స్‌ తమ దేశంలో దాచుకున్నవారి సమాచారం అందజేసింది. సుమారు 219కేసుల్లో లెక్కకు రాని రూ.565కోట్ల ధనాన్ని ఆదాయపు పన్ను అధికారులు కనుగొన్నారు. అందులో రూ. 181కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిపింది. పార్లమెంట్‌ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీకి కూడా ఆదాయపు పన్ను శాఖ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాగా సుమారు 30765నల్లధనం కేసులకు సంబంధించి ఫీల్డ్‌ ఇంటెలిజన్స్‌ యూనిట్స్‌ (ఎఫ్‌ఐయు)లు రహస్య సమాచారం సేకరించినట్లు తెలిసింది.