ఫ్రెండ్లీ పోలీస్ కు నిర్వచనం ఎస్సై రమేష్ బాబు
ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సట్ల వెంకన్న
కేసముద్రం సెప్టెంబర్ 11 జనం సాక్షి /
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీస్ విధానంకు నిర్వచనంగా కేసముద్రం ఎస్సై రమేష్ బాబు నిలుస్తున్నాడని ఎంపీటీసీ ల ఫోరమ్ మండల అధ్యక్షుడు సట్ల వెంకన్న కొనియాడారు.శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రతి సమస్యను ప్రజలతో మమేకమై పరిష్కరిస్తున్నాడని సట్ల వెంకన్న అన్నారు.అది వారం స్థానిక పోలీస్ నివాస గృహాల్లో ఎస్సై రమేష్ బాబు అద్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు.ఎస్సై రమేష్ బాబు స్వయంగా భక్తులకు,పోలీసులకు,ప్రజా ప్రతినిధులకు అన్నదానం చేసి ఆదర్శంగా నిలిచారు.ఈ కార్యక్రమంలో గుగులోతు వీరు నాయక్, పోలీసులు సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు , భక్తులు పాల్గొన్నారు.
Attachments area