డీజీపీ ముందు 41 మంది మావోయిస్టులు లొంగుబాటు
` మిగిలిన వారూ జనజీవనస్రవంతిలో కలవండి
` లొంగిపోయిన వారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎర్రగుళ్ల రవి
– ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరుగురు డివిజన్ కమిటీ సభ్యులు
` ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 509 మంది మావోయిస్టులు జనజీవనస్రవంతిలోకి..
` కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారికి రావాల్సిన పరిహారాన్ని అందిస్తాం
` హామీ ఇచ్చిన డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అందులో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎర్రగుళ్ల రవి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరుగురు డివిజన్ కమిటీ సభ్యులు ఉన్నారు. మావోయిస్టుల నుంచి పోలీసులు 24 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.వివిధ దళాల్లో పనిచేస్తున్న మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడిరచారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు కామారెడ్డి జిల్లా వాసి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్, మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్ కాగా మిగతా వాళ్లు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని తెలిపారు. కుమురం భీమ్ డివిజన్ కమిటీ కార్యదర్శి, ఇద్దరు సెంట్రల్ విజన్ కమాండర్లు లొంగిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 509 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. మావోయిస్టులు లొంగిపోవడానికి ప్రధాన కారణం 2026 మార్చి 31 వరకు కొత్త ప్రాంతాలకు వెళ్లాలని మావోయిస్టు పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయని డీజీపీ తెలిపారు. తెలియని ప్రాంతాలకు వెళ్లడం, నిత్యావసర వస్తువులు సరైన సమయంలో అందకపోవడం, కీలక నాయకులే లొంగిపోతున్న నేపథ్యంలో కిందిస్థాయి మావోయిస్టులు లొంగిపోయేందుకు ముందుకు వచ్చారన్నారు. ప్రభుత్వం లొంగిపోయిన వారికి క్యాడర్ ప్రకారం నగదు పరిహారం అందిస్తుందని, ఆయుధాలతో లొంగిపోయే వారికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేస్తుందని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన 41 మంది మావోయిస్టులపై రూ. 1.46 కోట్లు కోట్ల రివార్డు ఉందన్న ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారికి రావాల్సిన పరిహారాన్ని అందిస్తామన్నారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25వేలను అందించినట్లు తెలిపారు. ఏ రాష్ట్రాలకు చెందిన వారిని ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగిస్తామని అన్నారు.ప్రస్తుతం మావోయిస్టుల్లో మొత్తం 54 మంది మాత్రమే తెలంగాణ వాళ్లు ఉన్నారని, వీరిలో ఆరుగురు మాత్రమే తెలంగాణలో పనిచేస్తున్నారని శివధర్ రెడ్డి అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు అప్పగించిన ఆయుధాలు దాదాపు అన్ని పోలీసుల నుంచి కొల్లగొట్టినవేనన్నారు, ఆర్మీ, పోలీసులు వద్ద ఉండే ఆయుధాలే వారి వద్ద ఉన్నాయని, దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులకు ఆయుధాల సీరియల్ నెంబర్‌లపై సమాచారం ఇస్తామన్నారు. వారికి గతంలో మిస్సైన ఆయుధాలను అప్పగించనున్నట్లు తెలిపారు.
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి.. హైదరాబాద్‌కు సంబంధం లేదు: డీజీపీ
హైదరాబాద్(జనంసాక్షి): ఇటీవల ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనపై తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి స్పందించారు. కాల్పులకు పాల్పడిన సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌కు చెందినవాడే అయినప్పటికే ఉగ్రఘటనతో హైదరాబాద్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు. 1998లో ఉపాధి కోసం ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ అక్రమ్ ఆరు సార్లు భారతదేశానికి వచ్చాడన్నారు. అస్ట్రేలియాలోనే యురోపియన్ యువతిని పెళ్లి చేసుకున్న తర్వాత 1998లో భార్యతో పాటు ఒకసారి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలిపారు. 2004లో, 2009 ఫిబ్రవరిలో మరోసారి వచ్చాడన్నారు. 2011 జూన్‌లో, 2016లో ప్రాపర్టీ సెటిల్‌మెంట్ కోసం వచ్చాడని చెప్పారు. 2022లో చివరి సారిగా తల్లి, సోదరిని చూడటం కోసం వచ్చాడని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. బోండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.



