ఫ్లడ్‌ లైట్‌ టవర్‌ ఎక్కిన ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ విసృతసమావేశం జరుగుతున్న లాల్‌ బహుదూర్‌ స్టేడియం వద్ద అలజడి నెలకొంది. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితికి చెందిన కార్య కర్తలు స్టేడియంలోని ఫ్లడ్‌లైట్ల టవర్లను ఎక్కారు. తెలంగాణ, ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌ తన స్పష్టమైన వైఖరి ప్రకటించాలని వారు డిమాండ్‌ చేశారు.