జూబ్లీహిల్స్ (హైదరాబాద్): బంజారాహిల్స్ ఎన్‌బీటీ నగర్‌లో నివాసముంటున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్య ఆటోలో వెళ్తుండగా దోపిడీ జరిగిన ఘటన బంజారాహిల్స్‌లో చోటు చేసుకుంది. దివ్య(25) మంగళవారం రాత్రి 11గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ నుంచి మియాపూర్‌లోని తన తల్లి ఇంటికి ఆటోలో వెళ్తుండగా రోడ్ నెం.12కు రాగానే గుర్తు తెలియని ఆగంతుకులు ఆమెను వెంబడించారు. ఆమె చేతిలో హ్యాండ్ బ్యాగ్ లాక్కొని పరారయ్యారు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. 5 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.5వేల నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొంది. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.