బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

ఇద్దరికి గాయాలు
హైదరాబాద్‌: నగరంలో నిన్న ఆర్థరాత్రి జనవరి రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 12లో ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెళ్తూ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతున్ని ఆసిఫ్‌నగర్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

తాజావార్తలు