బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం.
కౌడిపల్లి (జనంసాక్షి).. బతుకమ్మ చీరల పంపిణీలో భాగంగా గురువారం రోజున కౌడిపల్లి మండల పరిధిలోని ధర్మసాగర్, ముట్రాజ్ పల్లి, రాజిపేట్, వెంకటాపూర్ గ్రామాలలో బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగిందని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సారా రామా గౌడ్ వైసీపీ నవీన్ కుమార్ గుప్తా తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ రోజున మహిళలు పాత చీరలను ధరించకుండా నూతన వస్త్రాలు ధరించే విధంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, సర్పంచ్లు సంజీవ్, లింగం గౌడ్, శేఖర్ గుప్తా తో పాటు ఆయా గ్రామాల ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.