బదిలీల మార్గదర్శకాలు సరిగా లేవు: టీజాక్‌

హైదరాబాద్‌: టీచర్ల బదితీలకు ప్రభుత్వం రూపొందిన మార్గదర్శకాలు సరిగా లేవని తెలంగాణ టీచర్ల జూఏసీ (టీ-జాక్ట్‌) మండిపడింది. ఈమేరకు టీ-జాక్ట్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బృందం ఈరోజు వాద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడించింది. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ నేతలు మాట్లాడారు. ప్రభుత్వం టీచర్ల బదీలీల కోసం రూపొందించిన నియమావళి వలన అవినీతి జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన పంధాను మార్చుకొని జీవోలో మార్పులు చేయకపోతే ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.