బద్రి చిన్నకుమారుడు మృతి

బద్రి చిన్నకుమారుడు మృతి

విజయవాడ: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ప్రముఖ న్యూస్ రీడర్ బద్రి చిన్న కుమారుడు సాయి సాత్విక్(8) ప్రాణాలు కోల్పోయాడు. పెద్ద కుమారుడు పరిస్థితి విషమంగా ఉంది. మరికొంత సమయం గడిస్తేగాని అతడి పరిస్థితి గురించి చెప్పలేమని వైద్యులు తెలిపారు. బద్రి భార్య లక్ష్మీ సుజాతకు ప్రాణాయం తప్పిందని చెప్పారు.

ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన బద్రి బంధువు కోలుకుంటున్నారు. తమ కుమారులిద్దరూ రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోవడంతో బద్రి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బద్రి సోదరుడు కూడా గతంలో రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందాడు.