బలపడిన అల్పపీడనం

విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశాలోని బాలాసోర్‌లో వద్ద ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఈమేరకు విశాఖలోని వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఒడిశా నుంచి కోస్తాంద్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి కోనగాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా, తెలంగాణల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాయలసీమలో కూడా జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది.