బళ్లారి ఎంపీ ఎన్నికను రద్దు చేసిన కర్ణాటక హైకోర్టు

బెంగళూర్‌: బళ్లారి ఎంపీ శాంత ఎన్నికను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది.ఆమె ఎన్నికను రద్దు చేయాలంటూ కర్ణాటక హైకోర్టులో చంద్రగౌడ్‌ పిటిషన్‌ వేశారు. తప్పుడు కులధ్రువీకరణ పత్రం ఇచ్చారనీ, ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఓటింగ్‌కు రెండురోజుల ముందు అక్రమాలకు పాల్పడ్డారని శాంతాపై ఆరోపణలు చేశారు.ఈ కేసును విచారించిన కర్ణాటక హైకోర్టు ఆరోపణలు సక్రమమేనని భావించి శాంత ఎన్నిక చెల్లదని ప్రకటించింది.4 వారాల్లో తిరిగి ఓట్ల లెక్కింపు జరిపించాలని ఈసీని ఆదేశించింది. శాంత గాలి జనార్దన్‌రెడ్డి వర్గానికి చెందినవారు కావడం గమనార్హం.