బస్సు ఎక్కుతూ జారిపడి మహిళ మృతి

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ మెట్టుగూడ వద్ద ఈ ఉదయం బస్సు ఎక్కుతూ జారిపడి ఓ మహిళ మృతి చెందింది. దీంతో ఈ మార్గంలో వాహనాలు 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు చర్చలు చేపట్టారు.