బస్సు ఛార్జీలను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని తెదేపా ఎమ్మెల్యేల నిరసన

హైదరాబాద్‌: పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. సామాన్యులపై భారం మోపేలా ఉన్న ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ, తెదేపా ఎమ్మెల్యేలు ఆ పార్టీ శాసనసభాపక్ష కార్యాలయం వద్ద ప్లకార్డుల ప్రదర్శన నిర్విహించారు. గ్రామిణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సు ఛార్జీలను పెంచడం అమానుషమని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శాసనసభ సమావేశాలు ముగిసిన 24 గంటలు గడవక ముందే ప్రజల నెత్తిన పెనుభారం మోపిందన్నారు.