బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే

న్యూఢిల్లీ: ఢిల్లీ ఘటన బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు మంగళవారం ప్రకటించారు. ఆమెకు వెంటిలేటరు సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. సోమవారం అంతర్గత రక్తస్రావం కావడంతో పరిస్థితి మరింత విషమించవచ్చని ఆందోళన చెండిన నేప్యంలో ఈ రోజు ఆమె రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య 70 వేలకు పెరిగినట్లు సమాచారం. ఆదివారం ఆది 19 వేలకు పడిపోయిన సంగతి తెలిసిందే. సెప్సిన్‌ కారణంగా అంతర్గత రక్తస్రావం ఇప్టపికీ ఆందోళన పరిచే  అంశంగానే ఉండడం గమనార్హం.