బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుం మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

సారంగాపూర్‌,మే 27(జనంసాక్షి) :
మండలంలోని కోనాపూర్‌ గ్రామశివారులో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో పశుగ్రాసం, ఈతవనం దగ్ధంకాగా ఆదివారం మాజీ మంత్రి జీవన్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగ్ని ప్రమా దంలో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తానని ఆన్నారు. అగ్ని ప్రమాదం సంభవించిన తీరును గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత శాఖాధికారులతో ఫోన్‌లో మాట్లాడి అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వారిని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని పేర్కోన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు తోడేటి శేఖర్‌ గౌడ్‌,జనార్ధ్థన్‌ గౌడ్‌,శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ, లచ్చం,కిష్టయ్య,దుబ్బయ్య,ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.