బాలకార్మికుల చట్టానికి సవరణలు

న్యూఢిల్లీ: బాల కార్మికుల చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. బాల కార్మికత నిర్మూలన చట్టం 1986కు సవరణలను ప్రతిపాదించింది. బాల కార్మికులను పరిశ్రమల్లో చేర్చుకోవడాన్ని పూర్తిగా నిషేధించాలని పేర్కొంది. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారం 14 ఏళ్ల లోపు పిల్లలు పరిశ్రమల్లో పనిచేయడాన్ని ప్రమాదకరంగా పరిగణించడంలేదు. కాని, ప్రస్తుత సవరణల ప్రకారం 14 ఏళ్ల లోపు పిల్లలు ప్రమాదమైన, ప్రమాదకరం కాని ఏ పరిశ్రమల్లో పనిచేసిన తీవ్రంగా పరిగణించబడుతుంది. ఈ చట్టం 6 నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత విద్య పొందే హక్కును సాకారం చేస్తుందని కార్మిక, ఉపాధి శాఖ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ సూత్రాల కనుగుణంగా ఈ చట్టం ఉంటుందని పేర్కొన్నారు.