బాలికపై అత్యాచారం

వరంగల్‌: మహబూబాబాద్‌ మండలం సీతల్‌తండాలో ఒక బాలికను అక్కడి దుకాణ యజమాని గర్భవతిని చేశాడు. ఈ వ్యవహరం బయటకు పొక్కకుండా గ్రామపెద్దలు పంచాయతీ నిర్వహించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో వారు రంగంలోకి దిగి పంచాయతీ నిర్వహించిన గ్రామ పెద్దలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.5.70లక్షలు స్వాధీనం చేసుకున్నారు.