బి టి పి ఎస్ జెన్కో కార్యాలయ ఆవరణలో ఘనంగా అన్నదానం.
పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 29 (జనంసాక్షి): భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్లో శరన్నవరాత్రులు పురస్కరించుకొని దుర్గాదేవి విగ్రహం ఏర్పాటుచేసిన సందర్భంగా
జెన్కో కార్యాలయం ఆవరణంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ముఖ్యఅతిథిగా విచ్చేసిన బి టి పి ఎస్ సి ఈ బిచ్చన్న దంపతులు దుర్గాదేవి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కార్మికులకు స్థానికులకు అధికారులకు వారే స్వయంగా పర్యవేక్షిస్తూ అందరికీ అన్నదానం అందే విధంగా చూస్తూ ఆయన చేతుల మీదుగా అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.అన్ని దానాల్లో కల్లా అన్నదానం మహాభాగ్యం అన్నారు.ఈ కార్యక్రమంలో జెన్కో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.