బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి

 ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరికలు

న‌ల్ల‌గొండ  (జనం సాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ‌ పథ‌కాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని న‌కిరేక‌ల్ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య అన్నారు. సోమ‌వారం
నార్కట్ పల్లి మండలం బాగిగుడెం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు 50 మంది ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో నార్కట్ పల్లి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాల‌న‌లో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంద‌న్నారు. పార్టీలో చేరిన ప్ర‌తి కార్య‌క‌ర్త‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటామ‌న్నారు. పార్టీలో చేరిన వారిలో వంగాల సాయి చరణ్, వంగాల శేఖర్, వంగాలసంజీవ, వంగాల నర్సింహా, వంగాల హనుమంతు, వంగాల నాగ స్వామి, వంగాల నరేందర్, వంగాల శ్రీను, మన్నే శివాజీ, వంగాల మహేందర్, వంగాల వెంకన్న, వంగాల మారయ్య, వంగాల స్వామి,తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో షాపెల్లి గ్రామ సర్పంచ్, బెండల పహాడ్ గ్రామ సర్పంచ్, శేఖర్ రెడ్డి, BRSV నియోజకవర్గ మాజీ ప్రధాన కార్యదర్శి చినపాక రమేశ్, మాజీ సర్పంచ్ రాందాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కృష్ణా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.