బీఆర్‌ఎస్ సభ్యుల
కుటుంబాలకు‘బీమా’భరోసాబీఆర్‌ఎస్ సభ్యుల కుటుంబాలకు‘బీమా’భరోసాఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ.. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ సభ్యుల కుటుంబాలకు పార్టీ భరోసాగా నిలిచే కార్యక్రమాన్ని పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసిఆర్ గారు ఏర్పాటు చేశారని కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ‘పట్నం నరేందర్ రెడ్డి అన్నారు
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని రేగడి మైలారం గ్రామానికి చెందిన “నెల్లి లాలమ్మ” ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతిచెందిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు బీఆర్‌ఎస్ సభ్యత్వం కలిగి ఉండడంతో పార్టీ సమూహ ప్రమాద బీమా’ నుంచి మంజూరైన ‘రూ.2 లక్షల’ చెక్కును ఈ రోజు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి.. వారి భర్తకు అందించారు.
అదేవిధంగా కొత్తపల్లి మండలంలోని నందిగామ గ్రామానికి చెందిన ఇటీవల కాలంలో మరణించిన కుటుంబానికి ఈ భీమా అండగా నిలిచింది.. ఈ సందర్భంగా రెండు లక్షల ప్రమాద బీమాను ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాధవరెడ్డి అయిన ,సంపత్ కుమార్’ కు అందజేయడం జరిగింది
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడి కుటుంబానికి నేనున్నా నంటూ సీఎం కేసీఆర్ భరోసాగా నిలిచి వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందించేందుకు శ్రీకారం చుట్టారన్నారు
దీనివల్ల ఆ కుటుంబాలకు ఎంతో కొంత పార్టీ ద్వారా ఆర్థికసాయం అందుతుందన్నారు. అంతేగాక ఇలాంటి పథకాలు కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే అమలు కావడం ప్రజల అదృష్టమన్నారు. వీటితోపాటు రైతుబీమా పథకం రైతుల కుటుంబాలకు ఎంతో మేలు కల్పిస్తుందన్నారు. ప్రతి పథకాన్నీ రాష్ట్రంలో ప్రజల ముంగిటకు తీసుకెళ్లిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని అన్నారు
బీఆర్‌ఎస్ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు