బీజేపీకి మజ్లిస్‌ బీ `టీం

` తెలంగాణలో కాంగ్రెస్‌ తుపాను రాబోతోంది
` సర్వశక్తులు ఒడ్డి జనం గెలిపిస్తరు
` ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తం
` మీతో నాది కుటుంబ సంబంధం: రాహుల్‌
హైదరాబాద్‌,నవంబర్‌28(జనంసాక్షి) ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో భాజపా నిర్ణయిస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే మజ్లిస్‌ పోటీ చేస్తోందని విమర్శించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లిలో నిర్వహించిన కార్నర్‌ విూటింగ్‌లో రాహుల్‌ మాట్లాడారు. దిల్లీలో ఎంపీల నివాసం నుంచి తనను వెళ్లగొట్టినా బాధపడలేదన్నారు. దేశ ప్రజలందరి గుండెల్లో తనకు ఇల్లు ఉందని బయటకి వచ్చినట్లు చెప్పారు. ఈడీ విచారణ పేరుతో తనను గంటల కొద్దీ కూర్చోబెట్టారన్నారు.’’భాజపా చెప్పిన చోటే ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేస్తారు. భాజపా, భారాస, ఎంఐఎం ఒకటే టీమ్‌.. వారు కలిసే పనిచేస్తారు. అవినీతిపరుడైన కేసీఆర్‌పై ఒక్క కేసూ లేదు. మోదీ సర్కార్‌ తెచ్చిన అన్ని బిల్లులకు భారాస మద్దతు పలికింది. భారాసకు ఓటేస్తే మళ్లీ దొరల సర్కార్‌.. కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రజల సర్కార్‌ ఏర్పడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. అవినీతి వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగింది.హైదరాబాద్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు ప్రాజెక్టు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు మంజూరు చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. భాజపా, భారాస పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయి. రూ.1200కు పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ను రూ.400కే అందిస్తాం. రైతుభరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేలు చొప్పున ఇస్తాం. యువ వికాసం పేరుతో విద్యార్థులకు రూ.5లక్షల ఆర్థికసాయం చేస్తాం’’ అని రాహుల్‌ గాంధీ వివరించారు.కాగా తెలంగాణలో కాంగ్రెస్‌ తుఫాన్‌ రాబోతోందని రాహుల్‌ గాంధీ అన్నారు. మంగళవారం సాయంత్రం మల్కాజ్‌ గిరిలో జరిగిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలతో తమది రక్త సంబంధమని, కుటుంబ బంధమని చెప్పారు. ఇందిరాగాంధీ నుంచి తమ వరకు ఆత్మ సంబంధమని అన్నారు. కుట్రలు, హింస లేని భారత్‌ కోసం తాను భారత్‌ జోడో యాత్ర చేసినట్టు చెప్పారు. తనపై మోదీ ప్రభుత్వం 24 కేసులు పెట్టిందని, తనకు ఇచ్చిన క్వార్టర్‌ ను వాపస్‌ తీసుకుందని చెప్పారు. తెలంగాణలో ఇంత అవినీతి జరుగుతున్న కేసీఆర్‌ పై కేంద్ర ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు.ఈడీ, ఐటీ, సీబీఐ కేసులెందుకు పెట్టడం లేదన్నారు. మోదీ, కేసీఆర్‌ ఒక్కటేనని రాహుల్‌ పునరుద్ఘాటించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎంఐఎం పోటీ చేస్తుంది కానీ, తెలంగాణలో చేయదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్‌ తిన్న అవినీతి సొమ్మును కక్కించి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని చెప్పారు. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్‌ఎస్‌ సర్కారులో నిరుద్యోగులకు కొలువు రాలేదన్నారు. పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని అన్నారు. పీసీసీ చీఫ్‌? రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలే కథానాయకులై పోలింగ్‌ రోజు ముందు ఉండి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. చెల్లెలు ప్రియాంకతో కలసి ఆయన రోడ్‌షోలో పాల్గొన్నారు. పిసిసి చీఫ్‌ రేవంత్‌, మైనంపల్లిలు కూడా పాల్గొన్నారు. కాగా