బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయం

ఆదిలాబాద్‌, జూలై 29 : బిసిలకు తగిన ప్రాధాన్యత ఇస్తుందని ఈ మేరకు తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చట్ట సభల్లో బిసిలకు వంద సీట్లు కేటాయిస్తామని ప్రకటించడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు పేర్కొన్నారు. బిసిలకు పెద్ద పీఠం వేయడమే కాకుండా, బడ్జెట్‌లో అదనంగా బిసిల సంక్షేమానికి 10వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారని ఆయన అన్నారు. బడుగు వర్గాలకు, మహిళల సంక్షేమానికి తమ పార్టీ ఎంతో కృషి చేస్తుందని అన్నారు. పెదల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ఎన్టీఆర్‌ ఆశయాలను చంద్రబాబునాయుడు కొనసాగిస్తూ, బిసిల సంక్షేమం కోసం చట్టసభల్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తెలిపారు.