బీసీలకు ఉప ప్రణాళిక ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలి

శ్రీకాళహస్తి: ఎస్సీ, ఎస్టీల మాదిరి బీసీలకు ఉప ప్రణాళిక అవసరమని రాష్ట్ర బీసీ కమిటీ ఛైర్మన్‌ తిప్పేస్వామి అన్నారు. మంగళవారం ఆయన శ్రీకాళహస్తి వచ్చి అలయంలో రాహు, కేతు సర్పదోష నివారణ పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన విధంగా బీసీలకు ఉప ప్రణాళిక ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై ఇప్పటికే అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. వచ్చేనెల 3,4,5 తేదీల్లో బీసీ సంక్షేమ కమిటీ వరంగల్‌ జీల్లా సందర్శించనున్నట్లు వివరించారు.