బీసీ డిక్లరేషన్‌పై పలువురు జాతీయ నేతలతో భేటీ: చంద్రబాబు
ఢిల్లీ: బీసీలకు సామాజిక న్యాయం జరగడం లేదని చంద్రబాబునాయుడు అన్నారు. బీసీ డిక్లరేషన్‌పై పలువురు జాతీయ నేతలతో భేటీ అయిన చంద్రబాబు ఈరోజు సాయంత్రం విలేరులతో మాట్లాడుతూ తమ బీసీ డిక్లరేషన్ జాతీయ అజెండా కావాలన్నది తెదేపా అభిమతమని చెప్పారు. ఓబీసీలకు సామాజిక న్యాయం జరగట్లేదని, ఆర్థిక సంస్కరణల ఫలితాలు అన్నివర్గాలకు అందడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. బీసీల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు నెలల గడువు ఇస్తున్నామని, స్పందించకుంటే జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని చంద్రబాబు తెలిపారు.



