బీసీ డిక్లరేషన్‌పై భాజపా మద్దతిచ్చినా స్వీకరిస్తాం: చంద్రబాబు

ఢిల్లీ: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేయాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చట్టసభల ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలుచేయాలన్నారు. బీసీ డిక్లరేషన్‌పై భాజపా మద్దతిచ్చినా స్వీకరిస్తామన్నారు. చాలా రాష్ట్రాలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు అమలుకావడం లేదని చంద్రబాబు ఆరోపించారు.