బీసీ సంక్షేమ రిజర్వేషన్ల వ్వవహారంపై చర్చ

హైదరాబాద్‌: స్థానిక సంస్థల్లో బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు తగ్గరాదని బీసీ సంక్షేమ కమిటీ ఛైర్మన్‌ తిప్పేస్వామి అన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఇవాళ సమావేశమైన బీసీ సంక్షేమ కమిటీ రిజర్వేషన్ల వ్వవహారంపై చర్చించింది. జనాభాలో 50శాతం ఉన్న బీసీలకు ప్రస్తుత రిజర్వేషన్లు యాధాతంథంగా ఉండాలని, సుప్రీంకోర్టుకు వెళ్లటం లేదా రాజ్యాంగా సవరణ జరగాలని కమిటీ అభిప్రాయ పడింది.