బెజవాడ కనకదుర్గపై విజయనగర వాసుల డాక్యుమెంటరీ

విజయనగరం జూన్‌ 30 :’శ్రీ కనకదుర్గ మహత్యం’ పేరుతో విజయనగరానికి చెందిన ఎన్‌.వి.సింగకుమార్‌, ఎన్‌.వి.రంగరామానుజుల సోదరులు ఓ డాక్యుమెంటరీ సినిమా తీసి విజయవాడ శ్రీకనకదుర్గా దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ అధికారి సి.ప్రేమకుమార్‌కు అందజేసి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. పేరుతో విజయనగరానికి చెందిన ఎన్‌.వి.సింగకుమార్‌, ఎన్‌.వి.రంగరామానుజుల సోదరులు ఓ డాక్యుమెంటరీ సినిమా తీసి విజయవాడ శ్రీకనకదుర్గా దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ అధికారి సి.ప్రేమకుమార్‌కు అందజేసి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. దాదాపు రెండు గంటల నిడివిగల ఈ డాక్యుమెంటరీని అందజేసే కార్యక్రమంలో పిఆర్‌ఒ అచ్యుతరామయ్య, విజయనగరం డిసిసి అధ్యక్షులు కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈ సినిమాను ఆలయంలో ప్రదర్శించగా సికింద్రాబాద్‌ ఎంపి ఎం.అంజన్‌కుమార్‌, టిటిడి చైర్మన్‌ కనుమూరి బాపిరాజు, గుంటూరు ఎంపి రాయపాటి సాంబశవరావు, ఎమ్మెల్యేలు ఆళ్ళ నాని, రామకృష్ణారెడ్డి తదితరులు వీక్షించి ప్రశంసించారు.