బెయిల్‌పై ఎమ్మెల్యే సాయిరాజ్‌ విడుదల

గార: విద్యుత్‌కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన కేసులో ఆరెస్టయి గత 12రోజులుగా శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని అంపోలు జిల్లా జైలులో ఉన్న ఇచ్చపురం ఎమ్మెల్యే పి. సాయిరాజ్‌ ఈరోజు బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకోసం తాను ఒక్కసారికాదు వందసార్లయిన జైలుకు వెళతానని స్పష్టం చేశారు.