బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాజీనామా

హైదరాబాద్‌: కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెదేపాకు, పర్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఈ మేకు అధినేత చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపారు. తెలంగాణపై కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడంలో తప్పులేదన్న బైరెడ్డి, ఆ లేఖలో రాయలసీమ ప్రస్తావన తీసుకురాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తనకున్న 19ఏళ్ల అనుబంధాన్ని రాయలసీమ కోసం తృణప్రాయంగా వదులుకుంటునానన్నారు.