బొత్సతో ఆర్టీసీ ఈయూ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్‌: డీజిల్‌ ధరలు పెరిగిన నేపథ్యంలో రవాణ శాఖ మంత్రి బొత్స సత్య నారాయణతో ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఆర్టీసీ కొనుగోలు చేసే డీజీల్‌పై పెంచిన ధరలు తగ్గించాలని బొత్సకు వినతి పత్రం  సమర్పించారు. ఈ విషయంలో మంత్రి సానుకూలంగా స్పందించారని ఈయూ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ నెల 28న ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశానికి మంత్రి అంగీకరించారని చెప్పారు.

తాజావార్తలు