బోర్డు తిప్పేసి పరారైన ఎస్‌కే గ్లోబల్ కన్సల్టెన్సీ..

హైదరాబాద్: నగరంలోని తార్నాకలో ఏర్పాటు చేసిన ఎస్‌కే గ్లోబల్ కన్సల్టెన్సీ బోర్డు తిప్పేసింది. ఆ కన్సల్టెన్సీ నిర్వాహకుడు పవన్‌కుమార్‌ విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.50 వేల నుంచి నుంచి లక్ష వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఆ విధంగా నిరుద్యోగుల వద్ద నుంచి సుమారు రూ.2కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలియవచ్చింది. ఎంతకు వారికి ఉద్యోగాలు రాకపోవడంతో నిర్వాహకుడిని గట్టిగా నిలదీయడంతో రేపు, మాపు అని తిప్పుతూ కార్యాలయానికి తాళం వేసి పవన్ కుమార్ పరారయ్యాడు. దీంతో బాధితులు ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.