బోసిపోయిన స్టేడియం రహదారి

హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్‌మ్యాచ్‌కు మొదటి రోజు అభిమానులు భారీగానే తరలివచ్చినా ఈరోజు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. నగరంలో వర్షం కురవటం, న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ చేసే సూచనలు కనబడటంతో స్టేడియానికి వెళ్లే రహదారి బోసిపోయి కనిపించింది.