బ్యాట్మెంటన్ క్రీడాకారున్ని ప్రోత్సహించిన గండూరి కృపాకర్

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): బ్యాట్మెంటన్ క్రీడాకారుడు ఉత్తేజ్ కుమార్ భవిష్యత్తులో మరింత ఉన్నతంగా రాణించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ అన్నారు.బ్యాట్మెంటన్ క్రీడాకారుడు ఉత్తేజ్ కుమార్ ప్రోత్సహిస్తూ ఆటల నిర్వహణ కొరకు రూ.5 వేలు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలలో భాగంగా జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కు చెందిన కందిబండ ఉత్తేజ్ కుమార్ గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అండర్ 15,17,19 లలో పాల్గొని ఎంజీ యూనివర్సిటీ నుండి సౌత్ ఇంటర్ స్టేట్ లో, చదువులో రాణించారని అభినందించారు.ఇలాంటి క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో పట్టణం నుండి వివిధ క్రీడలకు చెందిన క్రీడాకారులను ఎంతోమందిని వెలికి తీయవచ్చునని అన్నారు.ఈ కార్యక్రమంలో కందిబండ ఉమామహేశ్వర రావు, బజ్జురు శ్రీనివాస్, వంగవీటి రమేష్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.