బ్రహ్మానందరెడ్డికి బెయిల్‌పై సీబీఐ కౌంటరు దాఖలు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో బ్రహ్మానందరెడ్డికి బెయిల్‌ ఇవ్వరాదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో సీబీఐ కౌంటరు దాఖలుచేసింది. బ్రహ్మానందరెడ్డికి బెయిల్‌ ఇవ్వరాదన్న సీబీఐ కౌంటర్‌పై విచారణను న్యాయస్థానం ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా  వేసింది.