బ్రాహ్మణ సంఘాల ధర్నా .. అరెస్టు

హైదరాబాద్‌ : దేనికైనా రెడీ సినిమాలో బ్రాహ్మణులపై చిత్రీకరించిన సన్నివేశాలను తొలగించాలని డిమాండ్‌చేస్తూ బ్రాహ్మణ సంఘాలు ఖైరతాబాద్‌ కూడలి వద్ద ధర్నాకు దిగాయి. సినీ నటుడు మోహన్‌బాబు, విష్ణులు తమవారిపై విచక్షణారహితంగా దాడిచేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పూజా కార్యక్రమాలు నిర్వహించే బ్రాహ్మణులపై ఈ మధ్య సినిమాల్లో అభ్యంతరకర సన్నివేశాలు చిత్రీకరిస్తున్నా సెన్సార్‌ బోర్డు ఏంచేస్తుందని ప్రశ్నించారు. అనంతరం రాజ్‌భవన్‌ వైపు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేనికైనా రెడీ దర్శక, నిర్మాతలను అరెస్టు చేయాలంటూ నేతలు డిమాండ్‌ చేశారు.