భక్తిశ్రద్ధలతో గణేశుడికి విశేష పూజలు…

పూజలో పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకురాలు విజయశాంతి…

వినాయక భక్త బృందం మండపం వద్ద కుంకుమార్చన…. పాల్గొన్న మహిళా భక్తులు…

నేడు అన్నదాన కార్యక్రమం…

కూకట్ పల్లి జనంసాక్షి :గణేష్ నవరాత్రి మహోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.వినాయక మండపాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. పూజలు, అన్నదాన కార్యక్రమాలతో మండపాలు కళకళలాడుతున్నాయి.కూకట్ పల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద మండపంలో కొలువుదీరిన గణనాధునికి మూడవ రోజున పురస్కరించుకొని శుక్రవారం వినాయక భక్తబృందం చైర్మన్ నాయినేని సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో సుమారు పదివేల మంది మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి సీనియర్ నాయకురాలు విజయశాంతి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం విజయశాంతి మాట్లాడుతూ వినాయక భక్త బృందం వారు గత 46 సంవత్సరాలుగా కూకట్ పల్లిలో భక్తి శ్రద్ధలతో గణనాధుని నవరాత్రి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తు ఉన్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేశారు.వినాయకుడి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుని వేడుకున్నట్లు ఆమె తెలిపారు.వినాయక భక్త బృందం కమిటీ అధ్యక్షులు,కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది వినాయక చవితిని వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.ఆహ్లాదకరంగా భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు.గణనాధుని కృప ఎల్లవేళలా కమిటీ సభ్యులపై,కూకట్ పల్లి ప్రజలపై ఉండాలని తమకు సేవ చేసుకునే భాగ్యం కలగాలని మరిన్ని సేవా కార్యక్రమాలు మును ముందు చేపట్టాలని ఏకదంతుడిని వేడుకున్నట్లు తెలిపారు.ప్రముఖ పారిశ్రామికవేత్త కురుమయ్య గారి కొండలరావు సహకారంతో నేడు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వినాయక భక్త బృందం వారు తెలిపారు.ఈ అన్నదాన కార్యక్రమలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో వినాయక భక్త బృందం కమిటీ కన్వీనర్ అర్చనపల్లి సూర్యరావు,అధ్యక్షులు గొట్టుముక్కల వెంకట్రావు, కోశాధికారి చౌదరి సూర్య రావు, సలహాదారులు నాయినేని పద్మారావు,చౌదరి నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాసురావు,వినాయక భక్త బృందం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.