భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌..

ఆరుగురు మావోయిస్టులు మృతి…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు ఎదురుపడిన మావోయిస్టులు.. కాల్పులు జరిపారు. దీంతో ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టుల మరణించారు. మృతుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

గుండాల మండలం ఎన్కౌంటర్లో గాయపడిన ఇద్దరు గ్రే హౌండ్స్ కానిస్టేబుల్స్ ను భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు..
అత్యవసర చికిత్స కొనసాగిస్తున్న వైద్యు..
గాయపడిన కానిస్టేబుల్స్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్న పోలీసులు
మృతులు
కుంజా వీరయ్య, అలియాస్ లచ్చన్న సుఖమా జిల్లా
పూణేం లక్మా , బీజాపూర్
కోవసి రాము, ఎటపాక , ఆంధ్ర ప్రదేశ్
పోడియం కోసయ్య, కొంటావా చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం
కోసి , నీల్వాయు,
దుర్గేష్ నీల్వాయి.‌
మృతులంతా లచ్చన్నదళ కు చెందిన సభ్యులు..
ఇద్దరు పోలీసులకు గాయాలు. భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు.
ఎన్కౌంటర్ స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు..
ములుగు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని కరకగూడెం, గుండాల, దామరతోగు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్.‌